ఇండియాలో టాప్ సెలబ్రిటీలు వీరే..!
- December 22, 2017
ప్రతి ఏడాది ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించే, ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిట్ 100 జాబితాలో ప్రముకంగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వరుసగా రెండవ ఏడాది కూడా టాప్ ప్లేస్ ను సొంతం చేసుకున్నారు.. 2016 లో టాప్ పొజిషన్ ను అందుకున్న సల్మాన్ తన వార్షిక రాబడి 232.83 కోట్లతో మరోసారి ఆస్థానాన్ని నిలబెట్టుకున్నారు.. ఇక బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ రూ 170 కోట్లతో జాబితాలో రెండో స్ధానంలో నిలవగా , టీమిండియా కెప్టెన్, విరాట్ కోహ్లి రూ 100.72 కోట్లతో 3 వ స్థానంలో నిలిచాడు. అంతేకాదు తన భార్య అయిన బాలీవుడ్ నటి అనుష్క శర్మ రూ 28 కోట్ల వార్షికాదాయంతో 32వ స్ధానం దక్కించుకున్నారు.. ఆ తర్వాత అక్షయ్ కుమార్ నాల్గవ స్థానంలో వీరి తర్వాత వరుసగా సచిన్ టెండూల్కర్, అమీర్ ఖాన్, ప్రియాంచ చోప్రా, ధోని, హృతిక్ రోషన్, రణ్వీర్ సింగ్‌లు టాప్ 10లో స్ధానం దక్కించుకున్నారు.. కాగా ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్, ఇండియా సెలబ్రిటీ 100 జాబితా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే..
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల