దుబాయి: 65,000 దిర్హం లను స్వాహా చేసిన వేలెట్ పార్కింగ్ సిబ్బంది
- November 18, 2015
దుబాయి వేలెట్ పార్కింగ్ సిబ్బంది ఒకే కార్డును అనేకసార్లు ఉపయోగించి 65,000 దిర్హం లను కాజేశారు. దుబాయి పొలిసు శాఖ వారి జనరల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ క్రిమినాలజీ హెడ్ అహ్మద్ మాతర్ అల్ ముహైరీ , సులభంగా చేరిపివేయగల ఒక ప్రత్యేక తరహా పెన్ ను ఉపయోగించి కారు నెంబర్లను రాసి, మరల చెరిపివేసి కొత్త నెంబర్లను రాస్తూ వేలేట్ పార్కింగ్ కంపెనీ నుండి 65,000 దిర్హం లను కాజేసినట్టు తెలియజేసారు. కాజేసిన సొమ్మును పంచుకోవడంలో గొడవపడి, వారిలో ఒకరు కంపెనీ యజమానికి ఫిర్యాదు చేయడంతో డొంకంతా కదిలి, పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసారు. ప్రధాన నిందితుడు, నేరం చేసినట్టు నిరాకరించినప్పటికీ, ఒకే కార్డుపై అనేక సార్లు చేతిరాతతో నెంబర్లు రాసినట్టు ఫోర్జరీ సెక్షన్ వారు ధ్రువీకరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







