బాంబు బెదిరింపులకు కారణంగా సాకర్ మ్యాచ్, రైళ్లు రద్దు
- November 18, 2015
జర్మనీలోని హనోవర్ నగరంలో బాంబులు పెట్టారన్న సమాచారం భద్రతా దళాలను ఉరుకులు, పరుగులు పెట్టించింది. దీంతో స్థానిక స్టేడియంలో జరగాల్సిన జర్మనీ-నెదర్లాండ్స్ జట్ల మధ్య జరగాల్సిన పుట్‌బాల్ మ్యాచ్ రద్దయింది. ఓ రైల్లో పేలుడు పదార్థాలు ఉన్నాయన్న సమాచారం రావడంతో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. జర్మనీ-నెదర్లాండ్స్ జట్ల మధ్య మంగళవారం రాత్రి ఫెండ్లీ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే మ్యాచ్ జరగాల్సిన స్టేడియం మీద బాంబు దాడి జరగవచ్చునని స్థానిక పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో అధికారులు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఆటగాళ్లను, ప్రేక్షకులను స్టేడియం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, తనిఖీలు నిర్వహించిన పోలీసులకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అక్కడి మంత్రి బారిస్ పిస్టోరియస్ తెలిపారు. ఇది ఇలా ఉండగా, హనోవర్ రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పద స్థితిలో దొరికిన ఓ బ్యాగ్ కలకలం సృష్టించింది. బ్యాగ్‌ను పరిశీలించిన అధికారులు అందులో ప్రమాదకర పదార్థాలు ఏమీ లేవని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అదేనగరంలో వేరొక స్టేడియంలో జరగాల్సిన సంగీత విభావరి కూడా బాంబు సమాచారం కారణంగా రద్దయింది. ఉగ్రవాదులు భీకర దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇలాంటి సమాచారాన్ని తేలికగా తీసుకోలేమని పోలీసులు చెప్పారు. ప్రజల భద్రతే ముఖ్యమని తెలిపారు. కాగా, ఇదే సాయంత్రం బాంబు బెదిరింపులకు కారణంగా, అమెరికా నుంచి ప్యారిస్ వెళ్లే పలు విమానాలను కూడా రద్దు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







