బీసీసీఐ జనరల్ మేనేజర్‌గా సబా కరీం
- December 23, 2017
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ నూతన జనరల్ మేనేజర్‌గా టీమిండియా మాజీ వికెట్ కీపర్ సబా కరీం నియమితులయ్యారు. జనవరి 1 నుంచి ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఎంవీ శ్రీధర్ రాజీనామాతో జనరల్ మేనేజర్ పోస్టు ఖాళీ అయింది. దీంతో ఈ ఏడాది అక్టోబరు మధ్యలో జనరల్ మేనేజర్-క్రికెట్ ఆపరేషన్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ ఆపరేషన్స్‌లో నైపుణ్యం గల వ్యక్తుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు అప్పట్లో బీసీసీఐ ప్రకటించింది. వచ్చిన దరఖాస్తులను వడపోసి సాబా కరీంను బీసీసీఐ ఎంపిక చేసింది.
కరీం భారత తరపున ఒక టెస్ట్ మ్యాచ్, 34 వన్డే మ్యాచులు ఆడాడు. 1997 నుంచి 2000 వరకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే బిహార్ తరపున వందకు పైగా ఫస్ట్-క్లాస్ మ్యాచులు ఆడి 7వేలకు పైగా పరుగులు చేశాడు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల