ప్రియాంక కు డాక్టరేట్
- December 23, 2017
ముంబయి: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది.బరేలీ అంతర్జాతీయ వర్శిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనుంది. ఆమె స్వస్థలం యూపీలోని బరేలీలో ఈ గౌరవం అందుకోనుండటం విశేషం. ఆదివారం ఆమెకు వర్శిటీ ఛాన్సలర్ కేశవ్ కుమార్ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి హర్షవర్థన్, యూపీ ఆర్థికమంత్రి రాజేశ్ అగర్వాల్ హాజరుకానున్నారు.
దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రియాంక స్వస్థలానికి వస్తున్న నేపథ్యంలో ఆమెకు జ్ఞాపికను అందజేయనున్నారు. తన కుమార్తెకు డాక్టరేట్ ప్రకటించడం పట్ల ప్రియాంక తల్లి మధు చోప్రా హర్షం వ్యక్తంచేశారు. కాగా, విద్య, వైద్యం, బాలికలకు విద్య అందించే లక్ష్యంతో ప్రియాంక ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. 2000లో ప్రపంచ సుందరిగా ఎంపికైన తర్వాత ఆమె ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఆమె యునిసెఫ్ అంతర్జాతీయ సౌహార్ద రాయబారిగానూ ఉన్నారు. గతేడాది పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.అటు సినిమా రంగానికి, ఇటు సామాజిక అంశాలపై పోరాడుతున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల