తాజా ఆంక్షలు యుద్ధ చర్యలే: ఉత్తర కొరియా

- December 24, 2017 , by Maagulf
తాజా ఆంక్షలు యుద్ధ చర్యలే: ఉత్తర కొరియా

బీజింగ్‌ : ఐక్యరాజ్య సమితి తాజాగా విధించిన ఆంక్షలపై ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర కొరియాపై సమితి కక్షగట్టిందని ఆ దేశం ఆరోపించింది. సమితి తీసుకున్న తాజా ఆంక్షలు యుద్ధ చర్యలుగానే పరిగణించాల్సి వస్తోంది అని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. దేశాన్ని ఆర్థికంగా నిర్వీర్యం చేసే ఎత్తుగడలను ఉత్తర కొరియా ఏ మాత్రం క్షమించదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఆంక్షలకు కారణమైన, వాటిని సమర్థించిన దేశాలన్నీ యుద్ధాన్ని కోరుకుంటున్నట్లుగానే ఉన్నాయని తెలిపింది. యుద్ధమే పరిష్కారమైతే అందుకు తగ్గ ఫలితాలను ఆయా దేశాలు అనుభవిస్తారని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ పేర్కొంది. 

ఈ మధ్యే ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణిని పరీక్షించడంతో.. ఐక్యరాజ్య సమితి తాజాగా కీలక ఆంక్షలు విధించింది. అందులో ప్రధానంగా... శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులపై నిషేధం విధించారు. దీంతో ఉత్తర కొరియా 90 శాతం పెట్రో ఉత్పత్తులను కోల్పోయింది. అంతేకాక ఆహార ఉత్పత్తులు, యంత్ర సామగ్రి, ఎలక్ట్రికల్‌ పరకరాలపై నిషేధాలను విధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com