మెసేజ్ యాప్ 'టెలిగ్రామ్' సైట్లు బ్లాక్
- November 18, 2015
సందేశాలను పంపే తమ యాప్ ద్వారా ఐఎస్ఎస్ ఉగ్రవాదులు వారి కార్యకలాపాలను నిర్వహించకుండా ఆ యాప్ రూపకర్తలు అడ్డుకట్టవేయనున్నారు. ప్రముఖ మెసేజ్ యాప్ 'టెలిగ్రామ్' సంస్థ వాళ్లు ఇస్లామిక్ స్టేట్ గ్రూపు సంబంధిత చర్యలకు పాల్పడే 78 ఛానళ్లు, సైట్లను బ్లాక్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం అందరికీ విదితమే. తమ యూజర్లను ఉగ్రవాదం వైపు దారి మళ్లించడానికి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు టెలిగ్రామ్ నిర్వాహకులు టెలిగ్రామ్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. గత వారం రోజుల నుంచి తమ యాప్ నిర్వాహకులు చేసిన ప్రయత్నాలు ఫలించి ఐస్ఎస్ సైట్లను బ్లాక్ చేసేందకు కోడింగ్ విధానం రూపొందిస్తున్నట్లు ఓ ఉద్యోగి చెప్పాడు. 12 భాషలకు సంబంధించిన సైట్లను ఐఎస్ఎస్ వినియోగిస్తుందని, ఆ ఉగ్రవాదులు తమ యాప్ వాడకుండా ఆ దిశగా టెలిగ్రామ్ యాప్ నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. బెర్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న టెలిగ్రామ్.. వ్యక్తిగత ఛాటింగ్ నుంచి గ్రూప్ ఛాటింగ్ వరకు 200 మంది ఒకేసారి మెసేజ్ లు పంపుకునే అవకాశం ఇందులో ఉంది. అయితే, ఈ యాప్ వాడి తమ యూజర్లను ఐస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వారి కార్యకలాపాల వైపు ఆకర్షించకుండా ఉండేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా కోడింగ్ విధానాన్ని అనుసరించినట్లు పేర్కొన్నాడు. టెలిగ్రామ్ యూజర్ల సమాచారాన్ని ఐఎస్ఎస్ ఉగ్రవాదులు రిట్రీవ్ చేయకుండా వారి డాటాని ఎన్ క్రిప్ట్ చేసే యోచనలో యాప్ రూపకర్తలు ఉన్నారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిచండటంతో పాటు తమ చర్యలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న యాప్ నిర్వాహకులపై దాడులు చేయాలన్న యోచనలో ఐఎస్ఐఎస్ ఉన్నట్లు వారు ప్రమాద సంకేతాలు పంపించారు. This week we blocked 78 ISIS-related channels across 12 languages. More info on our official channel: https://t.co/69Yhn2MCrK - Telegram Messenger (@telegram) November 18, 2015
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









