'గాయత్రి' ఫస్ట్‌లుక్
- December 24, 2017
హైదరాబాద్: అద్భుతమైన నటన, తనదైన డైలాగ్ డెలివరీతో తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన నటుడుమోహన్బాబు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న 42వ చిత్రం 'గాయత్రి'. దర్శకుడు ఆర్.మధన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో మోహన్‌బాబు కోపంగా చూస్తున్న తీరు.. 'ఆరోజు రాముడు చేసింది తప్పు అయితే..నాదీ తప్పే' అని రాసున్న క్యాప్షన్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని మోహన్‌బాబు సొంత నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌పై నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. మంచు విష్ణు, శ్రియ, ప్రముఖ యాంకర్, నటి అనసూయ, నిఖిలా విమల్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనసూయ జర్నలిస్ట్‌గా, నిఖిలా విమల్ మోహన్‌బాబు కుమార్తెగా కన్పించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ







