వాటికన్ సిటీలో వైభవంగా క్రిస్మస్ సంబరాలు...!!
- December 24, 2017
వాటికన్ సిటీలో క్రిస్మస్ సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సెయింట్ పీటర్స్ బసిలికా చర్చ్ లో జరిగిన క్రిస్మస్ నైట్ మాస్ కు పోప్ ఫ్రాన్సిస్ ఐదో సారి నేతృత్వం వహించారు. బాల యేసును ముద్దాడి ఆ విగ్రహాన్ని ఊరేగింపుగా తల్లి పొత్తిళ్లలోకి చేర్చాడు. క్రిస్మస్ వేడుక సందర్భంగా వలసదారులకు మద్దతు ప్రకటించిన పోప్.. వాటికన్ తరలివచ్చిన విదేశీయులకు స్వాగతం పలికారు.
క్రిస్మస్ వేడుకల సందర్భంగా క్రీస్తు పుట్టుకకు సంబంధించిన కథలను పోప్ చదివి వినిపించారు. రోమన్ చక్రవర్తి జనాభా లెక్కలకు ఆదేశించడం వల్లే ఇష్టం లేకపోయినా.. క్రీస్తు తల్లిదండ్రులు మేరీ, జోసెఫ్, ఇంకా ఎన్నో వేల మంది నజ్రెత్ నుంచి బెత్లహాంకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. జీసస్ కూడా సమాజం నుంచి దూరంగా బతకాల్సి వచ్చిందన్నారు. కొత్త సమాజం వలసలకు పిలుపునిచ్చిన పోప్ ఫ్రాన్సిస్ వలసదారులకు తన మద్దతు ప్రకటించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద చర్చి వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికాలో క్రిస్మస్ వేడుకలకు దాదాపు పది వేల మంది తరలివచ్చారు. మిగతా వారందరూ చర్చి బయటే ఉండి సంబరాలను తిలకించారు. కట్టుదిట్టమైన భద్రతతో చర్చిలోకి ప్రవేశించడానికి కొన్ని గంటల అందరినీ తనిఖీలు పూర్తి చేశారు.
క్రిస్మస్ వేడుకలకు కొన్ని గంటల ముందే వాటికన్ సిటీకి తరలివచ్చిన వారికి సెంటింట్ పీటర్స్ స్కేర్ దగ్గర పోప్ ఫ్రాన్సిస్ తన సందేశం వినిపించారు, ఫిలిప్పీన్స్లో ట్రెంబ్లిన్ తుఫాను బాధితుల కోసం ప్రార్థించారు. కొండచరియలు, వరదతో మృతిచెందిన వారి ఆత్మశాంతి కోసం, విలయంలో నిరాశ్రుయలైన వారికి సంక్షేమం కోసం ప్రార్థించాలని సెంయింట్ పీటర్ స్క్వేర్లో వారికి సూచించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల