డైరెక్టర్‌కి 'ఐ హేట్‌ యూ' చెప్పిన నటి!

- December 25, 2017 , by Maagulf
డైరెక్టర్‌కి 'ఐ హేట్‌ యూ' చెప్పిన నటి!

హైదరాబాద్‌: 'హలో'తో ప్రేక్షకులను మెప్పించింది కల్యాణి ప్రియదర్శన్‌. తన తొలి చిత్రంలోనే మంచి అభినయాన్ని ప్రదర్శించి యువత మనసును కొల్లగొట్టింది. అంతటి మంచి చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌కు కల్యాణి 'ఐ హేట్‌ యూ' చెప్పింది. ఇంతకీ ఆమె ఎందుకు చెప్పిందంటే.. ''మనం 'ఐ హేట్‌ యూ' అని ఎవరికైనా చెబితే మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు అర్థం'' అని సినిమాలో కల్యాణి డైలాగ్‌ చెప్తుంది. దాంతో నెటిజన్లంతా కల్యాణికి 'ఐ హేట్‌ యూ' అంటూ మెసేజ్‌లు, ట్వీట్లు చేస్తున్నారట. ఈ విషయాన్ని కల్యాణి ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ.. ''మీరు చూపిస్తున్న అభిమానానికి, 'ఐ హేట్‌ యూ' మెసేజ్‌లకి ధన్యవాదాలు. దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ గైడెన్సే ఇందుకు కారణం. 'ఐ హేట్‌ యూ టూ సర్‌'' అంటూ కల్యాణి ట్వీట్‌ చేసింది. శుక్రవారం విడుదలైన 'హలో' చిత్రం మంచి టాక్‌ అందుకుంటోంది.ఇందులో రమ్యకృష్ణ, జగపతిబాబు, అజయ్‌ కీలక పాత్రల్లో నటించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com