జెట్ ఎయిర్ వేస్ డిస్కౌంట్ టిక్కెట్స్
- December 25, 2017
మస్కట్: ఇండియాకి చెందిన జెట్ ఎయిర్ వేస్, విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. డిస్కౌంట్ ధరలకే టిక్కెట్లు లభ్యం కానున్నట్లు జెట్ ఎయిర్ వేస్ వెల్లడించింది. డిసెంబర్ 23 నుంచి జనవరి 2 వరకు బుక్ చేసుకున్న టిక్కెట్లపై 20 శాతం రాయితీని అందించనున్నారు. ఒమన్ నుంచి ఇండియాకి వెళ్ళే విమానాల్లోనూ అలాగే బ్యాంగ్‌కాక్, కొలంబో, ఢాకా, హాంగ్‌కాంగ్, ఖాట్మండు, సింగపూర్‌లకు కూడా ఈ డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. లిమిటెడ్ పీరియడ్ సేల్ ఆఫర్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్‌లో టిక్కెట్ల అమ్మకాలు జరుగుతాయి. టిక్కెట్లు పొందినవారు జనవరి 15 నుంచి ప్రయాణాలు చేసేందుకు వీలుంది. జెట్ ఎయిర్వేస్ వెబ్సైట్, మొబైల్ యాప్, ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా రాయితీ టిక్కెట్లను పొందే అవకాశం ఉంది. ఈ అద్భుతమైన ఆఫర్‌ని విమాన ప్రయాణీకులు వినియోగించుకోవాలని జెట్ ఎయిర్ వేస్ ఒమన్ జనరల్ మేనేజర్ వాసిమ్ జైయిది చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







