ఇండియన్స్‌కు మరోసారి షాక్‌ ఇస్తున్న ట్రంప్‌...!

- December 25, 2017 , by Maagulf
ఇండియన్స్‌కు మరోసారి షాక్‌ ఇస్తున్న ట్రంప్‌...!

అమెరికా ఉద్యోగంపై కలలు కంటున్న ఇండియన్స్‌కు మరోసారి షాక్‌ ఇస్తోంది ట్రంప్‌ గవర్న్‌మెంట్‌. H వన్‌ B వీసాల జారీ ప్రక్రియను మరింత కఠినతరం చేయడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. ఇవి అమల్లోకి వస్తే, H వన్‌ B వీసాలు సులువుగా దొరకవు. ఇంటర్నేషనల్‌ ఇమ్మిగ్రేషన్‌ సంస్థ ఫ్రాగోమెన్స్‌ తన వెబ్‌సైట్‌లో దీనిపై ఇచ్చిన సమాచారం.. H వన్‌ B వీసాల ఆశావహుల్లో ఆందోళన పెంచుతోంది.

2011లో కొన్ని కఠిన నిబంధనలపై DHS ప్రతిపాదనలను రూపొందించింది. వాటిని ఇప్పుడు అమలు చేయాలని భావిస్తోంది. దీని ప్రకారం H వన్ B క్యాప్ లాటరీ కోసం ముందుగానే అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాప్ నెంబర్ దక్కిన వాళ్లే క్యాప్ అప్లికేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ట్రంప్ నినాదమైన "బై అమెరికన్‌, హైర్ అమెరికన్‌" సిద్ధాంతానికి అనుగణంగా.. భారీగా వేతాలను ఇచ్చే వారికి మాత్రమే Hవన్‌ బి వీసాలు పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియా నుంచి వెళ్లే ఐటీ ఇంజనీర్లు, అమెరికాలో పనిచేస్తున్న భారత ఐటీ కంపెనీలు ఎక్కువగా ఈ వీసాలపైనే ఆధారపడుతున్నాయి. ఈ కొత్త నిబంధనలతో ఎక్కువమంది భారత టెక్నీషియన్లు అమెరికాలో ఉద్యోగం చేయడానికి వెళ్లే అవకాశం ఉండదు. H వన్ B వీసాలతో వస్తున్న నిపుణులు.. తమ జీవిత భాగస్వాములను, కుటుంబ సభ్యులను తీసుకురాకుండానూ కఠిన చర్యలు తేబోతున్నట్లు ఇటీవలై ట్రంప్ ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com