మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న సైరా

- December 25, 2017 , by Maagulf
మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న సైరా

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తెలుగునాట తొలి స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈనెల 6న ప్రారంభమైన మొదటి షెడ్యూల్ షూటింగ్‌ ఇటీవలే పూర్తి చేసుకుంది. దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

నగరంలోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీ సమీపంలోని అటవీ ప్రాంతంలో వేసిన ప్రత్యేక సెట్‌లో కీలక పోరాట సన్నివేశాలను తెరకెక్కించారు. ఇందుకోసం సినిమా టెక్నీషియన్లు సైతం దాదాపు 20రోజులపాటు తీవ్రంగా కష్టపడ్డారట. చిత్ర నిర్మాత రామ్ చరణ్ దగ్గరుండి నిర్మాణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 20 రోజులు కష్టపడి తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ను పూర్తిచేశారు.

ఈచిత్రంలో అమితాబ్, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ కిచ్చలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్‌ సేతుపతి ఈచిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అత్యంత నమ్మకమైన అనుయాయుల్లో ఒకడైన ఓబయ్య పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇక చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com