“శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్య” పై అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవం గడువు తేది పెంపు

- December 25, 2017 , by Maagulf
“శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్య” పై అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవం గడువు తేది పెంపు

శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా (1017-2017) 216 అడుగుల సమతా మూర్తి పంచలోహ విగ్రహ నిర్మాణాన్ని పురస్కరించుకుని, నేటి సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో శ్రీ రామానుజాచార్య జీవిత ఇతివృత్తం, ఆయన సమాజంలో తీసుకువచ్చిన సంస్కరణలు ఆవిష్కరించే విధంగా జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ (జీవ) మరియు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ & సేవ్ టెంపుల్స్.ఆర్గ్(USA) సంయుక్త అద్వర్యంలో “శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్య” పై అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఔత్సాహిక నిర్మాతల, దర్శకుల కోరికపై నిర్వాహకులు సానుకూలంగా స్పందించి ఈ చిత్రోత్సవ గడువు తేదిని 5 ఫిబ్రవరి 2018 వరకు పొడిగించడమైనదని సేవ్ టెంపుల్స్ ప్రచార సారధి డా. గజల్ శ్రీనివాస్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

అలాగే ఈ చలన చిత్రోత్సవాన్ని 2018 ఫిబ్రవరి 22,23,24 తేదీలలో హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లోను, 2018 ఫిబ్రవరి 25వ తేదిన అవార్డుల ప్రదానోత్సవం శంషాబాద్ లోని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ ఆశ్రమం లోను జరిగే విధంగా తేదీలను మార్పుచేసినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com