ఇక పై ఈ ఫోన్లకు వాట్సాప్ పనిచేయదు
- December 25, 2017
స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న వారందరికీ వాట్సాప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అయితే, కొందరు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు మాత్రం 2017 సంవత్సరంతో పాటు, తమ వాట్సాప్‌నకు వీడ్కోలు పలకక తప్పదు. బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టమ్, బ్లాక్‌బెర్రీ 10, విండోస్ 8.0 అంతకన్నా తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఫోన్లలో డిసెంబరు 31 తర్వాత వాట్సాప్ పనిచేయదు. ఈ ఓఎస్‌లతో పనిచేసే ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని సంస్థ పేర్కొంది.
ఈ రెండు ఓఎస్‌లకు ఈ ఏడాది జూన్‌తోనే సేవలు నిలిచిపోవాల్సి ఉండగా, వాట్సాప్ దాన్ని డిసెంబరు 31 2017 వరకూ పొడిగించింది. మరోవైపు నోకియా ఎస్40 ఫ్లాట్‌ఫాంపై నడిచే మొబైల్ ఫోన్లకు 2018 డిసెంబరు 31 వరకూ వాట్సాప్ సేవలు లభిస్తాయి. ఇక ఆండ్రాయిడ్ 2.3.7 అంతకన్నా పాత (జింజర్‌బ్రెడ్) ఓఎస్‌లతో నడిచే ఫోన్లలో వినియోగదారులు 2020 ఫిబ్రవరి 1 వరకూ వాట్సాప్‌ను వినియోగించుకోవచ్చు. 2017 జూన్ 30తో సింబియన్ ఎస్60 మొబైళ్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







