ఆస్ట్రేలియాలో కన్నుమూసిన సూర్యాపేటవాసి
- December 25, 2017
సూర్యాపేట జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి (36) అనే వ్యక్తి ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఇంజంవారిగూడానికి చెందిన ఈయన ఇన్ఫోసిస్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఆదినారాయణరెడ్డిని ఈ సంస్థ యాజమాన్యం సిడ్నీకి పంపింది. అయితే ఇటీవలే ఈయన మృతి మిస్టరీగా మారింది.
ఐదేళ్ళ కిందట ఈయనకు మిర్యాలగూడ నివాసి శిరీషతో వివాహం జరిగినట్టు తెలిసింది. వీరికి ఇద్దరు కవల పిల్లలున్నారు. మరో నెల రోజుల్లో తన భార్య, కుమార్తెలను ఆస్ట్రేలియా తీసుకువెళ్లేందుకు ఆదినారాయణ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే ఈ దారుణం జరిగింది. తన భర్త మృతితో శిరీష కన్నీరు మున్నీరవుతోంది. ఆయన మరణంపై ఇన్ఫోసిస్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా సరైన సమాధానం రాలేదని వాపోతోంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల