బాబాయ్.. అబ్బాయ్ లు వెబ్ సిరీస్ తో సందడి..!!

- December 25, 2017 , by Maagulf
బాబాయ్.. అబ్బాయ్ లు వెబ్ సిరీస్ తో సందడి..!!

తెలుగు లో వెబ్ సిరీస్ కు ప్రాముఖ్యం తెచ్చింది.. మెగా తనయ నీహారిక అని చెప్పవచ్చు.. అప్పటి నుంచి వెబ్ సిరీస్ హవా ఓ రేంజ్ లో కొనసాగుతున్నది. నాగార్జున, బాహుబలి వంటి సినిమాను నిర్మించిన బడా నిర్మాతలు సైతం వెబ్ సిరీస్ నిర్మాణ రంగంలో అడుగు పెట్టారు. వెబ్ సిరీస్ లో నటించడానికి ఇప్పటి వరకూ ఏ బడా హీరో ఆసక్తిని చూపించలేదు.. తాజాగా ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య నేపథ్య అంశంతో... "ఎల్ టీటీఈ" అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ రూపొందనున్నది. ఈ వెబ్ సిరీస్ లో ఐపీఎస్ అధికారి కార్తికేయన్ గా వెంకటేష్, ఓ కీలక పాత్రలో రానా నటించనున్నాడు అని టాక్ వినిపిస్తోంది. కథగా చెప్పాలంటే మూడు గంటల్లో పూర్తిగా చెప్పడం కష్టం అని.. అందుకనే ఈ స్టోరీని సినిమాకంటే.. వెన్ సిరీస్ గా ఐతే బాగుంటుందని భావించి నట్లు దర్శకుడు ఏఎంఆర్ రమేశ్ చెప్పారు.. ఈ వెబ్ సిరీస్ ను దక్షిణాది భాషలతో పాటు.. హిందీలో కూడా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com