మెగా డైరెక్టర్ కు మస్కట్ లో సన్మానము

- December 25, 2017 , by Maagulf

ఒమాన్: ఇటీవల సినిమా షూటింగ్ నిమిత్తము మెగా హీరో సాయిధర్మతేజ్, మెగా దర్శకుడు వినాయక్ మస్కట్ రావటము జరిగింది. వీరిని చిరు మెగా యూత్ ఫోర్స్ వ్యవస్థాపకులు చందక రాందాస్ నాయకత్వములో సాదరముగా ఆహ్వానించి డైరెక్టర్ వి.వి.వినాయక్ కి సన్మానము చేసి వాళ్ళ మెగాస్టార్ కు ఖైదీ150 పెద్ద హిట్ ఇచ్చినందుకు వినాయక్ ని కొనియాడారు. ఈ కార్యక్రమములో నిర్మత సి కళ్యాణ్ సోదరుడు వేంకేటేశ్వరావు కూడా పాలొగన్నారు. ఈ సందర్బముగా వినాయక్ మాటాడుతూ 'ఇది చిరు అభిమానుల గొప్పమనసు అని కొనియాడారు. ఎయిర్పోర్ట్ నుంచి మమ్ములను వెంట ఉండి షూటింగ్ అయిన రోజులన్నీ మా వెంబడి ఉండి మెగాస్టార్ కుటుంబము పై ఎనలేని ప్రేమ చూపెట్టిన మస్కట్ చిరు మెగా యూత్ ఫోర్స్ సబ్యులకు ధన్యవాదాలు' చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com