ప్రియుడితో నయన క్రిస్మస్

- December 26, 2017 , by Maagulf
ప్రియుడితో నయన క్రిస్మస్

నయనతార.. మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఈసారి కోరుకున్న ప్రియుడితో కలిసి క్రిస్మస్ ట్రీ ముందు నిలబడుతూ దిగిన సెల్ఫీ వైరల్ అయ్యింది. ఇంతకీ స్పెషలేంటి అంటూ చర్చించుకోవడం సినీలవర్స్ వంతైంది. నయనతార గ్లామర్ ఇండస్ర్టీలోకి వచ్చి 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీనికితోడు ఆమె నటించిన సినిమా ఈనెల 22న రిలీజైంది. అది కూడా హిట్ కావడంతో ఫుల్‌జోష్‌లో వుంది. అన్నట్లు ఈసారి క్రిస్మస్ వేడుకలను ఫ్యామిలీ, ప్రియుడితో కలిసి చెన్నైలోని కొత్త అపార్ట్‌మెంట్‌లో జరుపుకుంది.

విఘ్నేష్ శివన్ ఇచ్చిన సలహా మేరకు 10 అడుగుల పొడవున్న మంచు తరహాలోవున్న క్రిస్మస్ చెట్టుని దుబాయ్ నుంచి తెప్పించింది. ఇంట్లోనే ప్రియుడితో కలిసి దిగిన సెల్ఫీ ఇది. ఈ సందర్భంగా మ్యారేజ్ గురించి ఏదో ఒక విషయం రివీల్ చేస్తుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ప్రస్తుతం 'జై సింహా' వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుండగా, సైరా నరసింహారెడ్డిలోనూ కీలకపాత్ర పోషించనుంది నయనతార.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com