2017 తెలుగు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఫస్ట్ ప్లేస్ లో కీరవాణి..!!
- December 26, 2017
తెలుగు సినిమా సంగీతానికో చరిత్ర ఉంది. అదేంటంటే.. ఎన్నో సినిమాల విజయాల్లో సంగీతానిదే ప్రధాన పాట. పాట హిట్టైందా.. సినిమా మాగ్జిమం హిట్టు. ఆడియోను బట్టి ఓపెనింగ్స్ డిసైడ్ అయిన సందర్భాలూ ఉన్నాయి. మరి అలాంటి సంగీతం ఈయేడాది టాలీవుడ్ పై ఎలాంటి ముద్ర వేసింది. ఆ ముద్ర వెనక ఉన్న సంగీత దర్శకులెవరు.? వీరిలో ఎవరు.. ఎన్ని సినిమాలు చేశారు. ఆ చేసిన వారి సక్సెస్ రేటెంత..? అన్నీ దాటుకుని ఇప్పుడు మన టివి పాంచ్ పటాకా 2017లో టాప్ ఫైవ్ లో నిలిచిన సంగీత దర్శకులెవరో ఇప్పుడు తెలుసుకుందాం..!!
సంగీతం అంటే వినసొంపుగా ఉండాలి. పాట మొదలుకాగానే థియేటర్ లో నుంచి బయటకు వెళ్లేలా కాకుండా పాట మిస్ కాకూడదు అనే భావన కలగాలి. అలా ఈ యేడాది వచ్చిన సెన్షేషనల్ మూవీ అర్జున్ రెడ్డిలోని పాటలన్నీ వినసొంపుగానే కాదు.. కథను నడిపించాయి. సన్నివేశాన్ని ఎలివేట్ చేసిన సాహిత్యం.. సాహిత్యాన్ని స్పష్టంగా వినిపించిన సంగీతంతో ఆశ్చర్యం కలిగించి ఆహ్లాదాన్ని పంచింది అర్జున్ రెడ్డి సంగీతం.. ప్రతి పాటా మధురమే అన్నట్టుగా సాగిపోయిందీ ఆల్బమ్. నిజానికి అర్జున్ రెడ్డి సినిమాకు ముగ్గురు సంగీత దర్శకులు. పాటలు మాత్రం రథన్ అందించాడు. పాటలు మాత్రం సన్నివేశాను సారం సాగుతూ కథను ముందుకు నడిపించాయి. అందుకే అర్జున్ రెడ్డి పాటలు ఇప్పుడు ప్రతి యూత్ ఫోన్ లో రింగ్ టోన్స్ గా మారాయి. దీంతో 2017 అర్జున్ పాటల సంగీత దర్శకుడు రథన్ కు ఐదవ స్థానం..
ఇక ఆరేళ్ల పిల్లల నుంచి అరవైయేళ్ల వారి వరకూ అలవోకగా పాడుకునేలా చేసిన సంగీతం శక్తికాంతన్ కార్తీక్ ది. దిల్ రాజు నిర్మాణంలో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఫిదా సినిమాకు శక్తికాంతన్ సంగీతం ఇచ్చిన శక్తి అంతా ఇంతా కాదు. సినిమా సక్సెస్ లో మేజర్ షేర్ పాటలదే అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మధుప్రియ పాడిన వచ్చిండే మెల్లామెల్లగా వచ్చిండే పాట ఇప్పుడే కాదు మరో పదేళ్ల వరకూ ప్రతి పెళ్లి పందిరిలో వినిపించేంతటి ఫేమస్ అయిపోయింది.
అయితే ఫిదాకు పాటలు శక్తికాంతన్ నేపథ్య సంగీతం అందించింది జె.బి. నేపథ్య సంగీతం కూడా హండ్రెడ్ పర్సెంట్ అదిరిపోయింది. మామూలుగా శేఖర్ సినిమాల్లో పాటలు బావుంటాయి. ఈ మధ్య ఆ మ్యాజిక్ మిస్ అయిందనుకున్న వారికి హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ చెప్పింది ఫిదా. అందుకు కారణం అతని టేస్ట్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంతన్ కార్తీక్ టాలెంట్. ఈ టాలెంట్ చూపించి ఫిదా పాటలతో ఫిదా చేశాడు.. శక్తి కార్తీక్.. నాలుగవ స్థానం లో..
2017లో అన్ని వయసుల వారిని హాంట్ చేసిన సంగీతం ఒకటుంది. సంక్రాంతి సోయగాల్ని.. పల్చనవుతోన్న అనుబంధాలనూ అచ్చంగా చూపిన ఆ సినిమా శతమానం భవతి. ఆ పాటలను ఆబాలగోపాలం ఆనందంగా పాడుకోవడానికి కారణం సాహిత్యంలోని ప్రతిఅక్షరం స్పష్టంగా వినిపించేలా స్వరరచన ఉండటమే. శతమానం భవతిలోని ఏ పాట విన్నా ఓ హాయిదనం శ్రోతల్ని మైమరపిస్తుంది. పాటలు మాత్రమే కాదు.. నేపథ్య సంగీతం కూడా ఏ హడావిడీ లేకుండా సన్నివేశాను సారం ఆయా సీన్స్ ను ఎలివేట్ చేస్తూ సాగిపోతుంది... ఒక్కోసారి కవితాత్మకంగా మరోసారి.. మనసుల్ని మెలిపెట్టేలా అన్నమాట. మరి ఇలాంటి బెస్ట్ ఆల్బమ్ ఇచ్చిన మిక్కీ జే మేయర్ ఈ యేటి మేటి సంగీత దర్శకుల్లో టాఫ్ ఫైవ్ లిస్ట్ లో థర్డ్ ప్లేస్ లో నిలిస్తే ఆశ్చమేం ఉంది.
దేవీ శ్రీ ప్రసాద్.. ఎగసే సంగీత తరంగం.. ఆర్టిస్టుల ఇమేజ్ ను బట్టి కథానుగుణమైన సంగీతం ఇవ్వడంలో దేవీ ఎక్స్ పర్ట్. ఆ విషయం అతని కెరీర్ చూస్తే అర్థమౌతుంది. అదే ఈ యేడాదీ జరిగింది. ఈ యేడాది ఏకంగా ఎనిమిది సినిమాలకు సంగీతం అందించాడు దేవీ. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ హోదాలో ఉన్న ఓ సంగీత దర్శకుడూ ఇన్ని సినిమాలు చేయడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. సంక్రాంతికి వచ్చిన ఖైదీ నెంబర్ 150 నుంచి రేపు రాబోతోన్న ఎమ్.సి.ఏ వరకూ 2017లో అతని సినిమాల సంఖ్య ఎనిమిది. వీటిలో గౌతమీపుత్ర శాతకర్ణి మిస్ చేసుకున్నాడు కూడా. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడంటే సినిమా సగం సక్సెస్ అయినట్టే అని ఇండస్ట్రీలోనే కాదు.. ఆడియన్స్ లోనూ ఓ ఫీలింగ్ ఉంది. అందుకనే ఈ యేటి మేటి మ్యూజిక్ డైరెక్టర్స్ టాప్ ఫైవ్ లో దేవీ నెంబర్ టూ గా నిలిచాడు.
పాటలు వింటే మైమరచిపోవాలి.. ఆర్ఆర్ వస్తోంటే గూస్ బంప్స్ రావాలి. సీన్ వల్ల ఆర్ఆర్ గొప్పగా అనిపిస్తుందా.. ఆర్ఆర్ వల్ల సీన్ హైలెట్ అయ్యిందా తేల్చుకోలేని పరిస్థితి ఆడియన్ కు రావాలి. ఆ స్థాయి సంగీతం అందించాలంటే సినిమా కథపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలి. దర్శకుడి విజన్ పూర్తిస్థాయిలో తెలిసుండాలి. అలాగే.. ఆడియన్స్ పల్స్ హండ్రెడ్ పర్సెంట్ తెలిసుండాలి. అప్పుడే అలాంటి మ్యూజిక్ ఇవ్వడం సాధ్యమవుతుంది. ఇవన్నీ తెలుసు కాబట్టే బాహుబలితో ప్రపంచాన్ని మెప్పించాడు ఎమ్ఎమ్ కీరవాణి. రాజమౌళి సినిమాల్లోని సీన్స్ లో ఎమోషనల్ ఎలివేషన్ వెనక కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ది ఎంత కీలక పాత్రో అందరికీ తెలుసు. ఇన్నాళ్లూ కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ ఒకెత్తైతే.. బాహుబలి సంగీతం మరోఎత్తు. అందుకే ఇన్నాళ్లూ ఎమ్ఎమ్ అంటే ఏం చెప్పుకున్నా.. ఇక నుంచి ఎమ్.ఎమ్ అంటే మెస్మరైజింగ్ మ్యూజీషియన్ కీరవాణిగా పిలవాలి.. ఆ అర్హత ఇప్పుడు ప్రపంచ వ్యాప్త అభిమానుల్నుంచి కూడా సంపాదించాడు కాబట్టే.. ఇప్పుడు మన టివి5 2017టాప్ ఫైవ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఈ మెస్మరైజింగ్ మ్యూజీషియన్ కీరవాణి నెంబర్ వన్ గా నిలిచాడు..
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల