పవర్ స్టార్ ఫై మరింత ఆసక్తి పెంచుతున్న "కొడకా కోటేశ్వరరావు" పాట
- December 27, 2017
అజ్ఞాతవాసి సినిమాలో పవన్ పాడిన పాట ఎలా ఉండబోతోందో చిన్న టీజర్ చూపించి, దానిపై ఆసక్తి మరింత పెరిగేలా చేసింది చిత్ర యూనిట్. సంక్రాంతికి విడుదల అవుతున్న ఈ మూవీలో "కొడకా కోటేశ్వర్రావు" పాటను పవన్ పాడారు. డిసెంబర్ 31న సాయంత్రం 6 గంటలకు దీన్ని విడుదల చేయనున్నారు. ఇట్స్ పార్టీ టైమ్.. అని చెప్తూ ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు.
అత్తారింటికి దారేదిలో "కాటమరాయుడా" పాట పాడి అభిమానుల్ని అలరించిన పవన్, ఇప్పుడు అజ్ఞాతవాసిలోనూ గాయకుడిగా స్వరం వినిపించబోతున్నారు. ఈ పాట మొదలుపెట్టే ముందు "కొడకా" అంటూ పవన్ ఆగిపోయి నవ్వడం.. ఆ వెంటనే అనిరుథ్ 1.. 2.. 3.. అంటూ స్టార్ట్ చెప్పడం, ఈ వీడియో చూసేవాళ్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ







