ఫేస్బుక్ వాడాలన్నా ఆధార్ కార్డు కావాల్సిందే...!!
- December 27, 2017
ఇప్పుడు అన్నింటికీ ఆధార్‌తో లింక్ చేయాల్సి వస్తోంది. బ్యాంక్ అకౌంట్, ఫోన్ నంబర్ అన్నింటికీ ఆధారే ఆధారం. ఇకపై ఫేస్బుక్ వాడాలన్నా కూడా మీ ఆధార్ కార్డు ప్రకారమే లాగిన్ అవ్వాలట. ఇదేంటి.. సోషల్ మీడియాకు ఈ వివరాలెందుకంటారా. ఇదేమీ జోక్ కాదు. అలాగని టెన్షన్ పడొద్దు. ఇక్కడో చిన్న లాజిక్ ఉంది అంతే.
ఫేస్బుక్ వాడకుండా ఒక్క గంట కూడా ఉండేలేని రోజులొచ్చేశాయ్. ఫీలింగ్ హ్యాపీ, ఫీలింగ్ సాడ్.. ఫీలింగ్ ఎగ్జైటెడ్.. ఒకటేంటి షేర్ లు, లైకుల్లో అంతా కొట్టుకుపోతున్నారు. FB కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో వినియోగదారులను బాగానే ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సోషల్ మీడియా దిగ్గజం యూజర్లకు చిన్న పరీక్ష పెడుతోంది. అదే ఆధార్ కార్డు వివరాలు చెప్పడం. దీనర్థం ఆధార్ నంబర్ లింక్ చేయమని కాదు. మీ కార్డుపై మీ పేరు ఎలా ఉందో ఫేస్బుక్ లాగిన్ కూడా అలాగే ఉండేలా చేస్తే ఎలా ఉంటుందని చిన్న టెస్ట్ చేస్తోంది. ముఖ్యంగా కొత్త అకౌంట్ క్రియేట్ చేసే టైమ్‌లో ఈ మెసేజ్ వస్తుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఆధార్‌లో ఉన్నట్టుగా అంటే ఎంటర్ చేస్తే చాలు. అంతకుమించి పర్సనల్ డేటా ఏమీ చెప్పక్కర్లేదు. ఒరిజినల్ పేరుతో లాగిన్ ఉంటే ఎక్కువ మంది స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు వీలుంటుందనే ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేసినట్టు FB చెప్తోంది. అలాగే ఆధార్ ప్రకారం మీ పేరు ఎంటర్ చేయమని మీకు మెసేజ్ వచ్చినా దాని ప్రకారం లాగిన్ అవడం తప్పనిసరేమీ కాదు. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసెయ్యొచ్చు. ప్రైవసీ దెబ్బతీసేలా మీ పర్సనల్ ఇన్ఫో షేర్ చేయాల్సిన పని కూడా లేదు. ఫేక్ అకౌంట్లను ఫిల్టర్ చేసేందుకు ఇప్పటికే చాలా రకాల ప్రయత్నాలు చేసిన FB.. ఇప్పుడు అయినవాళ్లకు మనల్ని దగ్గర చేసేందుకంటూ ఆధార్ లింకుతో ముందుకొచ్చింది. ప్రస్తుతం ప్రయోగదశలోనే ఉన్న ఈ ఫీచర్ తప్పనిసరి చేస్తారా లేదా అన్నది మరికొద్ది నెలల తర్వాతే స్పష్టత వస్తుంది. ప్రస్తుతం ఫేస్బుక్ ఎక్కువగా వాడుతున్న దేశాల్లో మనమే అగ్రస్థానంలో ఉన్నాం. నెలకు 24 కోట్ల 10 లక్షల మంది యాక్టివ్ యూజర్లు FBలో గంటలకు గంటలు గడిపేస్తున్నారు. అమెరికాలో ఈ సంఖ్య 24 కోట్లు మాత్రమే. ఏదెలాగున్నా.. ఇన్నాళ్లూ జోకులేసినట్టు ఆధార్‌తో సోషల్ మీడియా అకౌంట్ జత చేయాల్సిన రోజులు కూడా త్వరలోనే వస్తుందేమో.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







