హైదరాబాద్‌ లో ఇంటర్నేషనల్ స్వీట్‌ ఫెస్టివల్‌

- December 27, 2017 , by Maagulf
హైదరాబాద్‌ లో ఇంటర్నేషనల్ స్వీట్‌ ఫెస్టివల్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రతిఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ పతంగుల పండుగకు అనుబంధంగా నిర్వహించే వరల్డ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌కు ఈ దఫా హైదరాబాద్‌ నగరం వేదిక కానుంది. ఈ పండుగ నిర్వహణలో భాగంగా తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అధ్యక్షతన వివిధ రాష్ట్రాల సాంస్కృతిక సంఘాల ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో నివసించే వివిధ రాష్ట్రాల, దేశాల ప్రజల ఆహార అలవాట్లను ప్రతిబింబించే వేదికగా ఈ అంతర్జాతీయ స్వీట్‌ ఫెస్టివల్‌ను నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వివిధ రాష్ట్రాలకు ప్రతిబింబంగా నిలిచే స్వీట్లను ఒకే వేదికపై ప్రదర్శించడం వల్ల రాష్ట్రాల ప్రజల మధ్య సాన్నిహిత్యం, పరస్పర గౌరవం పెరుగుతాయని బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. జనవరి 13 నుంచి 15 వ తేదీ వరకు సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో నిర్వహించనున్నారు. సుమారు లక్ష మంది హాజరవుతారని భావిస్తున్న ఈ ఫెస్టివల్‌కు సంబంధించి ఓ కార్యాచరణను రూపొందించే క్రమంలో వెంకటేశం నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, బెంజెమెన్‌లు సభ్యులుగా ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com