ఇతనే నా భర్త అంటూ.. సీక్రెట్ పెళ్లి ని బయట పెట్టిన బాలీవుడ్ హీరోయిన్
- December 27, 2017
బాలీవుడ్ బోల్డ్ అండ్ బ్యూటీ ఫుల్ నటి సుర్వీన్ చావ్లా 2009 లో మోహన్ బాబు, శర్వానంద్ లు నటించిన 'రాజు మహారాజు' సినిమాలో నటించింది.. 'హేట్ స్టోరీ 2' లో బోల్డ్ గా నటించిన ఈ అమ్మడు... తాజాగా తన సీక్రెట్ మ్యారేజ్ సంగతి బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. సుర్వీన్ చావ్లా ఓ ఫోటో పోస్ట్ చేసి.. ఇతనే నా భర్త.. ఆయన ఎవరో కాదు.. అక్షయ్ ఠాకూర్ అనే బిజినెస్ మెన్.. అని ఆ ఫోటోపాటు భర్త డీటైల్స్ ను ప్రకటించింది.. కాగా సుర్వీన్ చావ్లా, అక్షయ్ ఠాకూర్ ల మధ్య పరిచయం నాలుగేళ్ల క్రితం ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా జరిగింది.. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది.. స్నేహితుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకొన్నట్లు తెలుస్తోంది. అయితే.. వీరిద్దరూ.. 2015 జులై 28న ఇటలీ లో పెళ్లి చేసుకొన్నట్లు బీ టౌన్ వర్గాల టాక్.. అంతేకాదు రెండు ఏళ్ళు సీక్రెట్ గా వీరి పెళ్లి వ్యవహారం దాచారని అంటున్నారు.. అయితే ఈ జంట తాజాగా తమ పెళ్లి విషయాన్ని ప్రకటించి.. గ్రాండ్ గా పార్టీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట.. న్యూ ఇయర్ లో తమ పెళ్లి విషయం ప్రకటించాలని.. పార్టీకోసం తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్..
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







