వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల...!!
- December 27, 2017
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల కోసం తిరుమల దివ్యక్షేత్రం ముస్తాబైంది. ఇవాళ అర్ధరాత్రి అనంతరం 12.05 గంటల నుంచి వరుసగా స్వామివారికి కైంకర్యాలు జరగనున్నాయి. తిరుప్పావై పఠనంతో శ్రీవారిని మేల్కొలిపి, ధనుర్మాసం కైంకర్యాలు, శుక్రవారాభిషేకం ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ లోపు వైకుంఠ ద్వారాలను శాస్త్రోక్తంగా తీయనున్నారు. రేపు తెల్లవారుజామున 5 గంటల అనంతరం ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకు వీఐపీ దర్శనం ప్రారంభించి ఉదయం 7 గంటల నుంచి ధర్మదర్శనాన్ని ఆరంభించాలని టీటీడీ ఉన్నతాధికారులు సంకల్పంతో ఉన్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేసి పునీతులు కావాలనే భక్తిభావంతో లక్షలాదిగా తిరుమలకు తరలివస్తున్నారు.
శ్రీవారి భక్తులను ఉదయం 10 గంటల నుంచి క్యూలైన్లలోకి అనుమతించనున్నారు. వైకుంఠం-2లోని అన్ని కపార్ట్‌మెంట్లు నిండిన అనంతరం నారాయణగిరి ఉద్యానవనంలో తాత్కాలికంగా నిర్మించిన కంపార్ట్‌మెంట్లలో యాత్రికులను నింపనున్నారు. అనంతరం నూతనంగా 4 కిలోమీటర్ల పొడవున రెండు వరుసల్లో నిర్మించిన క్యూలైన్లలోకి అనుమతిస్తారు. ఇవాళ రాత్రికి క్యూలైన్లన్నీ నిండిపోయే అవకాశం ఉంది. తిరుమలకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు రానున్నట్లు టీటీడీకి సమాచారం అందింది. వీరి కోసం గదులను రిజర్వు చేసి సిద్ధంగా ఉంచారు. స్వయంగా వచ్చే ప్రముఖులను గుర్తించి వారికి గదులు, టిక్కెట్లు కేటాయించడానికి టీటీడీ ఏర్పాట్లు సిద్ధం చేసింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి స్వర్ణ రథోత్సవం, ద్వాదశి రోజున వేకువ జామున చక్రస్నానం జరుగుతుంది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







