హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్
- December 27, 2017
తెలంగాణ ప్రభుత్వం ప్రతిఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ పతంగుల పండుగకు అనుబంధంగా నిర్వహించే వరల్డ్ స్వీట్ ఫెస్టివల్‌కు ఈ దఫా హైదరాబాద్ నగరం వేదిక కానుంది. ఈ పండుగ నిర్వహణలో భాగంగా తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అధ్యక్షతన వివిధ రాష్ట్రాల సాంస్కృతిక సంఘాల ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో నివసించే వివిధ రాష్ట్రాల, దేశాల ప్రజల ఆహార అలవాట్లను ప్రతిబింబించే వేదికగా ఈ అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. వివిధ రాష్ట్రాలకు ప్రతిబింబంగా నిలిచే స్వీట్లను ఒకే వేదికపై ప్రదర్శించడం వల్ల రాష్ట్రాల ప్రజల మధ్య సాన్నిహిత్యం, పరస్పర గౌరవం పెరుగుతాయని బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. జనవరి 13 నుంచి 15 వ తేదీ వరకు సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో నిర్వహించనున్నారు. సుమారు లక్ష మంది హాజరవుతారని భావిస్తున్న ఈ ఫెస్టివల్‌కు సంబంధించి ఓ కార్యాచరణను రూపొందించే క్రమంలో వెంకటేశం నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, బెంజెమెన్లు సభ్యులుగా ఉన్నారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!