తన పెళ్లి గిఫ్ట్ లను అమ్మాలని సమంత నిర్ణయానికి పొంగిపోతున్న నాగ్,అమల...

- December 27, 2017 , by Maagulf
తన పెళ్లి గిఫ్ట్ లను అమ్మాలని సమంత నిర్ణయానికి పొంగిపోతున్న నాగ్,అమల...

చేయాలనే తపన ఉన్న హీరో, హీరోయిన్లు ఎక్కువగానే ఉన్నారు.. ఇక దక్షిణాది స్టార్ హీరోయిన్.. అక్కినేని వారింటి కొత్త కోడలు సమంత ఈ కోవలోకే వస్తుంది.. మానవసేవే మాధవ సేవ అని నమ్మే వ్యక్తి.. తన రూపం మాత్రమే అందం కాదు.. మనసుకూడా అందమే అని ఇప్పటికే తన పనులతో నిరూపించుకున్నది. ప్రత్యూష ఛారిటీ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ.. ఆపన్నులను ఆదుకొంటున్న సమంత మంచి పేరునే సంపాదించుకొన్నది. తాను సంపాదించిన డబ్బును అనాధలకు ఇస్తూ.. వారిని ఆదుకుంటూ.. తాను మాటల మనిషిని కాను.. చేతల మనిషిని అని నిరూపిస్తోంది.. సమంత.. నాగ చైతన్య ను ప్రేమించి.. పెళ్లి చేసుకొన్న తర్వాత వచ్చిన మొదటి క్రిస్మస్.. పండగ.. అత్తవారింట తొలి క్రిస్మస్ వేడుకలో.. తన భర్త చైతు సహాయంతో స్టార్స్ పెట్టి.. కొత్త కళను వచ్చేలా చేసింది. కాగా అదే రోజున తన అత్తమామలైన నాగార్జున అమలతో సమంత కొద్ది సేపు మాట్లాడిందట.. తన వివాహానికి వచ్చిన విలువైన వస్తువులను అమ్మేసి.. డబ్బులు చేసుకుందామని చెప్పారట సమంత.. ఎందుకని అని అమల అడిగిన ప్రశ్నకు అవి మనకు గొప్పవి కావచ్చు.. కానీ వాటిని ఇంట్లో అలా నిరుపయోగంగా ఉంచేకంటే.. అవి అమ్మితే మనకు చాలా డబ్బులు వస్తాయి.. అలా వచ్చిన డబ్బుతో మనం అనాధలకు.. ఆపదలో సహాయం కోసం ఎదురుచూసే వారిని ఆదుకోవడానికి ఉపయోగించవచ్చు అని చెప్పిందట.. దీంతో కోడలు ఆలోచనను మెచ్చిన నాగ్, అమలలు అలాగే చేద్దామని చెప్పారట.. త్వరలోనే నాగచైతన్య, సమంతల పెళ్ళికి సంబంధించిన బహుమతులను విక్రయించనున్నారని టాలీవుడ్ సినీవర్గాల టాక్..!! అయితే సమంత గతంలో తాను నటించిన సినిమాల్లో హీరోల వస్తువులను విక్రయించి అలా వచ్చిన డబ్బుని పేదవారి వైద్యం కోసం ఉపయోగించేది.. అన్న సంగతి విధితమే.. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com