పర్యటకులకు తీపి కబురు తెలిపిన సౌదీ ప్రభుత్వం

- December 28, 2017 , by Maagulf
పర్యటకులకు తీపి కబురు తెలిపిన సౌదీ ప్రభుత్వం

రియాద్: సౌదీఅరేబియా 2018  జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్) పర్యటకులకు భారం కానున్నదని భావిస్తున్న అక్కడి ప్రభుత్వం తిరిగి చెల్లించేలా సంస్కరణలు చేపట్టనుంది. విమాన టిక్కెట్లు కొనుగోలు సమయంలో పర్యటకులు చెల్లించిన వ్యాట్‌ను తిరిగి ఇచ్చేందుకు అవసరమైన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ సమాచారాన్ని జనరల్ అథారిటీ ఆఫ్ జకాత్ అండ్ ట్యాక్స్ అధికారులు ఈ విషయాన్ని అక్టోబర్ నెలలోనే ప్రకటించారు. జనవరి 1 నుంచే వ్యాట్ అమల్లోకి రానున్నదని, కానీ పర్యటకులకు జనవరి 1 నుంచే తిరిగి చెల్లించడం కుదరదని తొలుత  తెలిపారు. ఈ వెసులుబాటు కల్పించేందుకు అవసరమైన ప్రతిపాదనలు జరుగుతున్నాయని, ఓ స్పష్టత వచ్చిన తర్వాత పర్యటలకులకు వ్యాట్‌ను రిఫండ్ చేయనున్నామని అధికారులు పేర్కొన్నారు. ఇదిలావుండగా గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీఅరేబియాలో జనవరి 1 నుంచి 5 శాతం వ్యాట్ అమల్లోకి రానుంది. వివిధ వస్తువులు, సేవలపై ఈ భారం మోపనున్నారు .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com