చిరంజీవి కి వెన్నుపోటు పొడవనున్న జగపతి బాబు
- December 29, 2017
తొలితరం తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర 'సైరా.. నరసింహా రెడ్డి' మూవీగా తెరకెక్కనున్నది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉయ్యలవాడ నరసింహా రెడ్డి గా మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలు పెట్టుకొని మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకొన్నది. భారీ కాస్టింగ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రామ్ చరణ్.. కొణిదెల బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.. కాగా హీరో నుంచి విలన్ గా కెరీర్ ను టర్న్ తీసుకొని.. కెరీర్ లో ఓ రేంజ్ లో దూసుకొని పోతున్న జగపతి బాబు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.. జగపతి బాబు ఏ పాత్రలో కనిపించనున్నారో కూడా రివీల్ అయ్యింది.. నరసింహా రెడ్డి కి ఇద్దరు ముఖ్య అనుచరులు ఉంటారు.. ఒకరు నరసింహా రెడ్డి నమ్మిన బంటుగా ఉంటూ.. సహాయం చేసే ఓబయ్య అయితే.. మరొకరు సైరా వద్ద ఉంటూ.. నమ్మక ద్రోహం చేసే వారు.. అలా నమ్మక ద్రోహం చేసే పాత్రలో జగపతి బాబు నటించనున్నాడట.. సైరాకు సహాయకుడిగా ఉంటూ.. వెన్నుపోటు పొడుస్తాడు అని టాక్.. ఇక బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ సైరా గురువు గా కనిపించనున్నారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!







