తల్లి చనిపోయిన వార్తని విని గుండెపోటుతో మృతి చెందిన ప్రవాస భారతీయుడు
- December 31, 2017
యూఏఈ : నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లి మరణాన్ని ఆ కుమారుడు తట్టుకోలేక‘పోయాడు. వేల కిలోమీటర్ల దూరంలో విగతజీవిగా పడి ఉన్న తన మాతృమూర్తి జాలిగొలిపే రూపాన్ని తలచుకొని ఆ ప్రవాసీయుడి గుండె ఆగిపోయింది. స్థానిక ఉమ్ అల్ ఖువేన్ లో గత 20 ఏళ్లుగా ఒక టైలరింగ్ షాప్ లో పని చేస్తున్నకేరళకు చెందిన అనిల్ కుమార్ గోపినాథన్ గత వారం పండుగ రద్దీతో తలమునకలై దుకాణంలో పనిచేసుకొంటున్నాడు. గురువారం తన తల్లి మరణించిన వార్తను అనిల్ కుమార్ గోపినాథన్ కు ఫోన్ లో ఆకస్మికంగా తెలిపారు. ఆ సమాచారం తెలియగానే ఎంతో విచారించి తీవ్రంగా విలపించిన ఆయన అదే రాత్రి దుబాయ్ లో ఉద్యోగం చేసుకొంటున్న తన సోదరుడు సంతోష్ తో కల్సి కేరళలోని కొల్లం జిల్లాలోగల తన ఇంటికి తక్షణమే చేరుకోవాలని తలిచాడు. ఈ నేపథ్యంలో అనిల్ శుక్రవారం విమానంలో స్వదేశానికి చేరుకొనేందుకు ప్రయాణ ఏర్పాట్లు సైతం చేసుకొన్నాడు. కానీ మరుసటి రోజు శుక్రవారం ఉదయం అనిల్ కుమార్ గోపినాథన్ తన గదిలో కుప్పకూలిపోయే పరిస్థితిలో కనుగొన్నారు. వెంటనే స్పందిన అనిల్ మిత్రులు ఆసుపత్రికి తరలించారు కాని వారి ప్రయత్నం ఫలించలేదు. తన తల్లిని కడసారిగా చూద్దామనుకొన్న అనిల్ అత్యంత విషాదంగా తన ప్రాణాలు కోల్పోయి గత శనివారం రాత్రి విగతజీవిగా స్వస్థలం చేరుకోవడం ప్రవాస భారతీయుల హృదయాలను కలిచివేస్తుంది. హతన్మరణావార్తని తెలియనివ్వని నేపథ్యంలో అనిల్ కుమార్ గోపీనాధన్ భార్య మోళీ మరియు కుమార్తె ఆథీరా తిరిగిరాని లోకాలకువెళ్లిన అనిల్ కుమార్ గోపీనాధన్ కోసం ఆదివారం ఉదయం (నేడు ) ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







