ఆర్మీ ఆఫీసర్ అయిన శర్వానంద్
- December 31, 2017
విభిన్న చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శర్వానంద్. 2017లో రెండు ఘనవిజయాలు అందుకున్న ఈ యంగ్ హీరో కొత్త కొత్త ఏడాదిలోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. మహానుభావుడు సినిమాతో సత్తా చాటిన శర్వ, ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. లై సినిమాతో నిరాశపరిచిన హను, శర్వానంద్ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడట. అంతేకాదు సెకండ్ హాఫ్‌లో వచ్చే యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. శర్వానంద్ సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







