రజినికి సినీ ప్రముఖుల మద్దతు.!

- December 31, 2017 , by Maagulf
రజినికి సినీ ప్రముఖుల మద్దతు.!

దళపతి పొలిటికల్ ఎంట్రీ ప్రకటనపై పలువురు సినీ ప్రముఖులు అభినందనలు కురిపిస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి ఖుష్బూ స్పందిస్తూ ప్రజాస్వామ్యం, అభివృద్ధిపై రజనీకి నమ్మకం ఉందనే విషయం మనందరికీ తెలుసని రాజకీయాల్లో ఆయన రాణించాలని అభిలషించారు. సినీ రంగంలో మాదిరిగా రాజకీయాల్లో కూడా మీరు అద్భుతంగా ఎదగాలంటూ దర్శకుడు ప్రసన్న అన్నారు. తమిళ ప్రజలకు సేవ చేసే కొత్త నేతగా అవతరించాలని కోరారు. తమిళ ప్రజలు రజనీ వెంటే ఉంటారనిౌ రాజకీయాల్లో కూడా ఆయనకు తిరుగులేదని దర్శకుడు లింగుస్వామి అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com