ఇండిగో న్యూ ఇయర్ సేల్.!
- January 01, 2018
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో నూతన సంవత్సరం సందర్భంగా విమాన టిక్కెట్లపై ఆఫర్ ప్రకటించింది. ముఖ్యంగా న్యూ ఇయర్, హాలిడే డిమాండ్ను క్యాష్ చేసుకునే లక్ష్యంతో, విని యోగదారులను ఆకట్టుకునేలా తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. ఎంపిక చేసిన మార్గాల్లో డిస్కౌంట్ ధరల్లో ఈ టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఇండిగో వెబ్సైట్ సమాచారం జనవరి నెలలో అత్యధికంగా బుకింగ్ కోసం ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి.
బుకింగ్ పోర్టల్లోని ధరల ప్రకారం ఢిల్లీ నుంచి లక్నోకి టిక్కెట్ ప్రారంభ ధర రూ.1030గా ఉంది. అలాగే బాగ్డోగ్రా నుంచి గౌవహటికి ప్రారంభ ధర రూ.1005గానూ, కోయంబత్తూర్ నుంచి చెన్నైకి రూ.1095గా ఉంది. దీంతోపాటుగా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా జరిపే ఆన్లైన్ చెల్లింపులపై ప్రతి ప్యాసింజర్ కన్వీనియన్స్ ఫీజుగా (నాన్ రిఫెండబుల్)రూ.200 అదనంగా చెల్లించాల్సి ఉంది. మరికొన్ని విమాన సర్వీసుల టిక్కెట్ ధరల విషయానికి వస్తే... చెన్నై నుంచి బెంగళూరుకు రూ.1,120, చెన్నై నుంచి కోయంబత్తూరుకు రూ.1,148, ఢిల్లీ నుంచి జయపురకు రూ.1,176గా ఇండిగో నిర్ణయించింది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







