దుబాయ్ లో అనుమతి లేకుండా డ్రోన్‌లను ఉపయోగిస్తే భారీ జరిమానా.!
- January 01, 2018
దుబాయ్: సాంకేతికను దుర్వినియోగం చేస్తూ ..ఏ నూతన ఆవిష్కరణ అయినా అక్రమ కార్యకలాపాలకు కొందరు వాడుకోవడం ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. వినోదానికో ..వీడియో ల చిత్రీకరణకు ఎంతగానే సహాయపడే డ్రోన్‌లను అనుమతి లేకుండా అక్రమంగా ఉపయోగిస్తే భారీ జరిమానా విధిస్తామని దుబాయ్ ఏవియేషన్ శాఖ హెచ్చరించింది. ఎటువంటి లైసెన్స్ లేకుండానే కొంతమంది డ్రోన్‌లను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అటువంటి వారిపై చర్యలు తీసుకొనేందుకు యువరాజు మహ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తామ్ నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం రిజిష్టర్ కాని డ్రోన్‌లను వాడితే 2000 దిర్హమ్స్ నుంచి 20,000 దిర్హమ్స్ వరకు జరిమానా విధించనున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







