బుర్జ్‌ ఖలీఫా లైట్‌ షో: జనవరి 6 వరకు

- January 02, 2018 , by Maagulf
బుర్జ్‌ ఖలీఫా లైట్‌ షో: జనవరి 6 వరకు

దుబాయ్:న్యూ ఇయర్‌ ఈవెంట్‌ సందర్భంగా లేజర్‌ మరియు లైట్‌ షోతో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచిన బుర్జ్‌ ఖలీఫా, ఆ అద్భుతాన్ని మరికొన్ని రోజులపాటు కొనసాగించనుంది. మంగళ, బుధవారాల్లో రాత్రి 8 గంటలకు, గురు, శుక్ర మరియు శనివారాల్లో రాత్రి 10 గంటలకు ఈ లైవ్‌ షో సందర్శకుల్ని ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తనుంది. లైట్‌ అప్‌ 2018 పేరుతో డిసెంబర్‌ 31 అర్ధరాత్రి 12 గంటలకు ఈ షో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వీక్షకులు ఈ షోని తిలకించారు. దుబాయ్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఈ షో. ఇదే షోని జనవరి 6 వరకు వీక్షకుల కోసం కొనసాగించనున్నారు. హాంగ్‌కాంగ్‌లో 2013లో నెలకొల్పబడిన 'లార్జెస్ట్‌ లైట్‌ అండ్‌ సౌండ్‌ షో' రికార్డ్‌ని బుర్జ్‌ ఖలీఫా షో బ్రేక్‌ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com