అబుధాబి:కొత్త స్పీడ్ లిమిట్ అమల్లోకి
- January 02, 2018
అబుధాబి:అబుధాబిలోని కొన్ని ప్రముఖ రోడ్లపై కొత్త స్పీడ్ లిమిట్ అమల్లోకి వచ్చింది. జనవరి 1 నుంచి ఈ స్పీడ్ లిమిట్ని అమల్లోకి తెచ్చారు. అల్ ముఫ్రాక్, అల్ ఘువైఫాత్ అంతర్జాతీయ హైవేలపై గంటకు 140 కిలోమీటర్ల వేగ పరిమితిని విధించారు. సెంట్రల్ ఆపరేషన్స్ సెక్టార్ డైరెక్టర్ బ్రిగేడియర్ అల్ ఖల్ఫాన్ అల్ ధాదెరి మాట్లాడుతూ, వాహనదారులు స్పీడ్ లిమిట్కి అనుగుణంగా వాహనాలు నడపాలనీ, నిబంధనల్ని అతిక్రమించి తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడమే కాకుండా, ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. గంటకు 141 కిలోమీటర్ల వేగంతో పైన పేర్కొన్న రహదార్లపై వామనాలు దూసుకెళితే మాత్రం రాడార్స్ ఆ వాహనాల్ని రికార్డ్ చేస్తాయి, అనంతరం వాటిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







