బుర్జ్ ఖలీఫా లైట్ షో: జనవరి 6 వరకు
- January 02, 2018
దుబాయ్:న్యూ ఇయర్ ఈవెంట్ సందర్భంగా లేజర్ మరియు లైట్ షోతో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన బుర్జ్ ఖలీఫా, ఆ అద్భుతాన్ని మరికొన్ని రోజులపాటు కొనసాగించనుంది. మంగళ, బుధవారాల్లో రాత్రి 8 గంటలకు, గురు, శుక్ర మరియు శనివారాల్లో రాత్రి 10 గంటలకు ఈ లైవ్ షో సందర్శకుల్ని ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తనుంది. లైట్ అప్ 2018 పేరుతో డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు ఈ షో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వీక్షకులు ఈ షోని తిలకించారు. దుబాయ్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఈ షో. ఇదే షోని జనవరి 6 వరకు వీక్షకుల కోసం కొనసాగించనున్నారు. హాంగ్‌కాంగ్‌లో 2013లో నెలకొల్పబడిన 'లార్జెస్ట్ లైట్ అండ్ సౌండ్ షో' రికార్డ్‌ని బుర్జ్ ఖలీఫా షో బ్రేక్ చేసింది.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







