పెరూలో ఘోర బస్సు ప్రమాదం.. 48మంది మృతి
- January 02, 2018
లిమా: పెరూలో ఘోర బస్సు ప్రమాదం సంభవించి 48 మంది మృత్యువాతపడ్డారు. పెరూ రాజధాని లిమాకు 57 మందితో ప్రయాణిస్తున్న బస్సు.. ట్రక్కుకు ఢీకొట్టి లోయలో పడిపోయింది. బస్సు ఎత్తైన కొండ ప్రాంతం నుంచి కిందకు పడిపోవడంతో 48 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన పసమాయో ప్రాంతం చాలా ప్రమాదకరమైన కొండ అంచు ఇరుకైన రోడ్డు కావడంతో ఈ హైవేను డెవిల్ కర్వ్ అని అంటారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమించారని అధికారులు వెల్లడించారు. ప్రమాదంపై పెరూ అధ్యక్షుడు పెడ్రో పాబ్లో విచారం వ్యక్తంచేశారు. పెరూలో రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. 2016లో రోడ్డు ప్రమాదాల కారణంగా 2600 మంది మరణించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







