నూతన సంవత్సర వేడుకలలో 650 మంది అరెస్టు
- January 03, 2018_1514995298.jpg)
కువైట్: కొందరు ప్రబుద్ధులకు కొత్త ఏడాది కట కటాల వెనుక జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కువైట్ అధికారులు జనవరి ఒకటవ తేదీన కనీసం 650 మంది నేరస్థులను అరెస్టు చేసి హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ మంగళవారం ఈ సమాచారం తెలిపారు. నూతన ఏడాదిని పురస్కరించుకొని సెలవుల సందర్భంగా కొందరు తాగిన మద్యం తలకెక్కి తిక్కవేషాలు వేసిన 118 మందిని అదుపులో తీసుకోగా, మరో 90 మంది అక్రమ నివాసితులు పట్టుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని మరో 378 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. గైరుహాజరు కాబడిన 54 మందిని పట్టుకొన్నారు. నూతన సంవత్సర సెలవుల కాలంలో పోలీసులు 2,501 ఫోన్ కాల్స్ అందుకున్నారని, 1,363 మందిపై ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేశారని తెలిపారు. సెలవుదినం సందర్భంగా మానవతావాద కారణాలతో అత్యధికులను విడుదల చేయగా, రెచ్చిపోయిన మందిపై 1,075 కేసులు నమోదయ్యాయని ప్రకటన వెల్లడించింది.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!