2.ఓ టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్..!
- January 04, 2018
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 2.ఓ. గతంలో రజనీ, శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందింన రోబో సినిమాకు సీక్వల్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రతీనాయక పాత్రలో నటిస్తున్నారు. బ్రిటీష్ బ్యూటీ అమీజాక్సన్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. శంకర్ అత్యున్నత సాంకేతిక విలువలతో పూర్తిస్థాయి త్రీడి చిత్రంగా 2.ఓను రూపొందిస్తున్నారు.
దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది చిత్రయూనిట్. అందులో భాగంగా జనవరి 6న చిత్ర టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకేసారి తమిళ, తెలుగు, హిందీ భాషల్లో టీజర్ రిలీజ్ చేయనున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







