అమెరికాలో తీవ్ర చలిగాలు..12 మంది మృతి
- January 03, 2018
అమెరికా:చలి ప్రభావంతో అమెరికాలో పలు ప్రాంతాలు గజగజలాడుతున్నాయి. అమెరికా అంటార్కిటికాను తలపిస్తోంది. దేశంలో దాదాపు సగ భాగం పూర్తిగా మంచు దుప్పట్లోనే ఉంది. న్యూయార్క్‌లో ఉష్ణోగ్రత మైనస్ 35 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. అంటార్కిటికాలో ఇది మైనస్ 16 డిగ్రీలే ఉంది. అతి తీవ్ర చలిగాలుల కారణంగా ఇప్పటికే 12 మంది మృతిచెందినట్టు తెలుస్తోంది.
న్యూయార్క్ తో పాటు.. పలు పర్యాటక కేంద్రాలన్నీ మంచుగడ్డలను తలపిస్తున్నాయి. అమెరికా, కెనడా దేశాలకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన నయగారా జలపాతం వండర్‌ల్యాండ్‌గా మారింది. భయంకరమైన చలి.. మైనస్ ఉష్ణోగ్రతలతో నయగారా జల ప్రవాహాం కూడా గడ్డ కట్టింది. సమీపంలో ఉన్న చెట్లు, క్లిఫ్స్, దారులు అన్నీ మంచుమయంగా మారాయి. జలపాతం దూకుతున్నా.. పైన మాత్రం మంచు దిబ్బగా దర్శనమిస్తున్నది. ఎటు చూసినా.. నయగారా పరిసరాలు.. తెల్లగా మెరిసిపోతున్నాయి. ఇంత చలిలో కూడా పర్యాటకులు అందాలను ఆస్వాదిస్తున్నారు. ఫోటోలు, సెల్ఫీలతో తమ అనుభూతులను పదిలపరుచుకుంటున్నారు.
అమెరికాలో మంచు తుఫాన్ వల్ల ఆ ప్రాంతాల్లో పీడనం మరింత పడిపోనున్నది. వేగంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ ప్రభావం మరికొంతకాలం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నార్త్ఈస్ట్ ప్రాంతాల్లో హరికేన్ లాంటి వాతావరణం తలెత్తుతుందని చెబుతున్నారు. దీంతో అత్యంత భయంకరమైన చలి గాలులు వీస్తాయంటున్నారు. మంచు కూడా అత్యంత దట్టంగా కురువనున్నది. న్యూ ఇంగ్లండ్ లాంటి ప్రాంతాల్లో దాదాపు 6 నుంచి 12 ఇంచుల మేర మంచు కురవనున్నది. ఈ వారం చివరలోగా.. అమెరికా ఈశాన్య ప్రాంతాలన్నీ మార్స్ గ్రహం కన్నా అతిశీలంగా మారే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో సుమారు 2700 విమానాలను రద్దు చేశారు. న్యూహ్యాంప్‌షైర్‌లో సుమారు మైనస్ 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉంది.
అటు పశ్చిమ ఐరోపానూ చలిగాలులు వణికిస్తున్నాయి. దీనికితోడు గంటకు 160 కి.మీ. వేగంతో వీస్తున్న ప్రచండ గాలుల తీవ్రతకు రైళ్లు సైతం పట్టాలు తప్పుతున్నాయి. విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, బ్రిటన్, ఐర్లాండ్ తదితర దేశాల్లో లక్షలాది ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఇంగ్లాండ్‌లో మూడు జాతీయ రహదారుల్ని మూసివేయాల్సి వచ్చింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







