ఉత్తమ విలన్ : రివ్యూ

- May 02, 2015 , by Maagulf
ఉత్తమ విలన్ : రివ్యూ

  "కళాకారుడు మరణించినా మృత్యుంజయుడు" అన్న విషయాన్నీ చెప్పాలి అని ప్రయత్నించారు కమల్ హాసన్, నిజానికి ఈ చిత్రంలో క్లాసిక్ కి కావలసిన ఉన్నాయి కాని ఇది కనీసం ఆకట్టుకోలేకపోయింది అంటే రచనలో ఉన్న బలహీనత తెలిసిపోతుంది. ఇదే చిత్రం అనుకున్న విధంగా తీసి ఉంటె ప్రతి ప్రేక్షకుడి చేత కన్నీరు పెట్టించగల సత్తా ఉన్న అంశం ఇది, ఒక చిత్రంకి ప్రేక్షకుడు కనెక్ట్ కాలేకపోతే ఎటువంటి సన్నివేశం అయినా పేలవంగానే అనిపిస్తుంది కాని ఈ చిత్రంలో ప్రేక్షకుడు కనెక్ట్ కాకపోయినా మూడు సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడిని కట్టిపడేసి కన్నీళ్లు పెట్టిస్తాయి. అంతటి అద్భుతమయన సన్నివేశాలు అవి , అవి చూసాకనే చిత్రంలో ఉన్న ఘాడత తెలుస్తుంది. మంచి కాన్సెప్ట్, మంచి నటన , మంచి సంగీతం , ఇంకా మంచి నేపధ్య సంగీతం , కొన్ని అద్భుతమయిన సన్నివేశాలు , మంచి సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఉన్నా కూడా రచన బాగోలేకపోవడం మరియు దర్శకత్వం పేలవంగా ఉండటం , ఎడిటింగ్ మూలాన మంచి చిత్రం కాస్త మట్టి పాలయిపోయింది.. ఈ చిత్రంలో పలు అంశాలు కమల్ హసన్ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది.. ఆసక్తి ఉన్నవారు ప్రయత్నించవచ్చు.. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com