అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కు షాక్

- January 04, 2018 , by Maagulf

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగేశ్వరరావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రస్తుతం ఆయన వారసులు అక్కినేని నాగార్జున..ఆయన తనయులు అక్కినేని నాగ చైతన్య, అఖిల్ లు హీరోలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మద్యే అక్కినేని నాగచైతన్య సహనటి అయిన సమంతను వివాహం చేసుకున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. అక్కినేని కుటుంబానికి చెందిన అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గుర్తింపు (ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ -ఎఫ్.ఆర్.సి.ఏ)ను రద్దు చేసింది.

దేశవ్యాప్తంగా ఐటీ రిటర్న్స్‌ సమర్పించని పలు ఎన్జీవో సంస్థల గుర్తింపును రద్దు చేసినట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజుజు రాజ్యసభలో తెలిపారు. మరో ట్విస్ట్ ఏంటంటే..తెలంగాణకు చెందిన 190, ఏపీలోని 450 సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు రాజ్యసభలో తెలిపారు. గత కొంత కాలంగా అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 

అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డుల ప్రదానం చేస్తోంది. అలాగే గుడివాడలో అక్కినేని కుటుంబం వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది. కాగా, అక్కినేని ఇంటర్నేషనల్‌ పౌండేషన్‌ను 2004లో ఏర్పాటు చేయడమైంది. అప్పట్నుంచి ఇప్పటి వరకూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 

గురువారం రాజ్యసభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు గుర్తింపు రద్దు చేసిన సంస్థలను ప్రకటించారు. విదేశీ సంస్థల నుంచి విరాళాలు అందుకుంటున్న ఎన్జీవోలు వార్షిక ఆదాయ వివరాలు ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. ఈ ఆదేశాలు పాటించని ఎన్జీవో సంస్థలపైనే కేంద్రం ఇప్పుడు వేటు వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com