ఇండియాకి వెళుతున్నారా? ఎయిర్ ఇండియా స్పెషల్ ఆఫర్!
- January 04, 2018
మస్కట్: ఒమన్ నుంచి ఇండియాలోని ముంబైకి వెళ్ళే ప్రయాణీకులు తమతోపాటు 50 కిలోల చెక్ ఇన్ బ్యాగేజ్‌ని తీసుకెళ్ళేందుకు వీలు కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. జనవరి నెలాఖరు వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఎకానమీ మరియు బిజినెస్ క్లాస్ ప్యాసింజర్లకు ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇండియాలోని ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణీకులకు సైతం ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్ ఇండియా పేర్కొంది. ప్రత్యేకంగా యాడ్ ఆన్ ఫేర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వారానికి 24 విమానాల్ని ఒమన్ నుంచి ఇండియాకి ఎయిర్ ఇండియా నడుపుతోంది. వీటిల్లో ముంబై, చెన్నయ్ మరియు ఢిల్లీలకు నాన్ స్టాప్ ఫ్లైట్స్‌తోపాటుగా, వారంలో మూడుసార్లు హైద్రాబాద్, బెంగళూరుకి వెళ్ళే విమానాలూ ఉన్నాయి. ఈ లగేజ్ ఆఫర్‌ని పొందాలనుకునే ప్రయాణీకులు ఒమన్‌లోని ఎయిర్ ఇండియా కార్యాలయాలు లేదా, సంబంధిత ట్రావెల్ ఏజెంట్లను సంప్రదించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్







