గజల్ శ్రీనివాస్‌కు పోలీస్ కస్టడీ తప్పింది
- January 04, 2018
గజల్ శ్రీనివాస్ చీకటి జీవితం గుట్టు విప్పడానికి.. కస్టడీ కోసం పోలీసులు గట్టిగానే ప్రయత్నించారు. అయితే.. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను నాంపల్లికోర్టు తిరస్కరించింది. శ్రీనివాస్ చాలా మంది యువతులను వేధించాడని పోలీసులు భావిస్తున్నారు. ఆయన్ను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కోర్టుకు తెలిపారు. ఓవైపు దర్యాప్తు జరుగుతుండగా.. ఈ టైమ్‌లో శ్రీనివాస్ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే.. పోలీసుల వాదనను శ్రీనివాస్ తరపు న్యాయవాదులు ఖండించారు. ఇరుపక్షాల వాదనలను విన్న మెజిస్ట్రేట్ పోలీసుల కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించారు.
శ్రీనివాస్‌కు పోలీస్ కస్టడీ గండం తప్పడంతో.. ఇక బెయిల్‌పై ఆశలు చిగురించాయి. బెయిల్ పిటిషన్‌పై ఇవాళ నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది. అయితే.. గజల్ శ్రీనివాస్‌కు బెయిల్ వస్తుందా? రాదా? అనే టెన్షన్ ఆయన తరఫు లాయర్లలో కనిపిస్తోంది. న్యాయమూర్తి బెయిల్ ఇస్తారా? లేక, రిమాండ్ ముగిసే దాకా జైల్లోనే ఉంచుతారా? లేదంటే.. రిమాండ్‌ను మరింత కాలం పొడిగిస్తారా? ఇలా అనేక ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ







