గజల్ శ్రీనివాస్‌కు పోలీస్ కస్టడీ తప్పింది
- January 04, 2018గజల్ శ్రీనివాస్ చీకటి జీవితం గుట్టు విప్పడానికి.. కస్టడీ కోసం పోలీసులు గట్టిగానే ప్రయత్నించారు. అయితే.. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను నాంపల్లికోర్టు తిరస్కరించింది. శ్రీనివాస్ చాలా మంది యువతులను వేధించాడని పోలీసులు భావిస్తున్నారు. ఆయన్ను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కోర్టుకు తెలిపారు. ఓవైపు దర్యాప్తు జరుగుతుండగా.. ఈ టైమ్‌లో శ్రీనివాస్ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే.. పోలీసుల వాదనను శ్రీనివాస్ తరపు న్యాయవాదులు ఖండించారు. ఇరుపక్షాల వాదనలను విన్న మెజిస్ట్రేట్ పోలీసుల కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించారు.
శ్రీనివాస్‌కు పోలీస్ కస్టడీ గండం తప్పడంతో.. ఇక బెయిల్‌పై ఆశలు చిగురించాయి. బెయిల్ పిటిషన్‌పై ఇవాళ నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది. అయితే.. గజల్ శ్రీనివాస్‌కు బెయిల్ వస్తుందా? రాదా? అనే టెన్షన్ ఆయన తరఫు లాయర్లలో కనిపిస్తోంది. న్యాయమూర్తి బెయిల్ ఇస్తారా? లేక, రిమాండ్ ముగిసే దాకా జైల్లోనే ఉంచుతారా? లేదంటే.. రిమాండ్‌ను మరింత కాలం పొడిగిస్తారా? ఇలా అనేక ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇవాళ్టి కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం