జనవరి 8న 'జై సింహా' ప్రీ రిలీజ్ ఈవెంట్..

- January 05, 2018 , by Maagulf
జనవరి 8న 'జై సింహా' ప్రీ రిలీజ్ ఈవెంట్..

బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'జైసింహా'. నయనతార, నటాషాదోషి, హరిప్రియ కథానాయికలు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకుడు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పుడు ప్రమోషన్ పర్వంలోకి దిగింది. ఈనెల 8న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. బాలయ్యతో పనిచేసిన దర్శకులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరవుతారు. బోయపాటి, క్రిష్‌, తేజ. వీళ్లంతా ఈ వేడుకలో కనిపించే అవకాశం ఉంది.

'జైసింహా' అభిమానులు పండగ చేసుకునే సినిమా అని, ఇందులో బాలయ్య నట విశ్వరూపం చూస్తారని, ఎమోషనల్‌ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి నిర్మాత చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com