ఫేస్‌బుక్‌లో మరో కొత్త ఫీచర్‌ రానుంది

- January 05, 2018 , by Maagulf
ఫేస్‌బుక్‌లో మరో కొత్త ఫీచర్‌ రానుంది

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. యూజర్లు తమ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలను వాట్సాప్‌ స్టేటస్‌గా డైరెక్ట్‌గా పెట్టుకునేలా ఫేస్‌బుక్‌ ఈ కొత్త ఫీచర్‌ తీసుకురాబోతుంది. మీరు ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ అయితే, ఇన్‌స్టా స్టోరీలను ఫేస్‌బుక్‌ స్టోరీలుగా షేర్‌ చేసుకునే అవకాశం తెలిసే ఉంటుంది. త్వరలోనే వాట్సాప్‌ స్టేటస్‌గానూ ఇన్‌స్టా స్టోరీలు పెట్టుకునేలా యూజర్లకు అవకాశం కలుగనుంది. అయితే స్టేటస్‌ బార్‌లోకి స్టోరీ వచ్చిన 24 గంటల తర్వాత ఇది మనకు కనుబడదు. ప్రస్తుతం ఈ ఫీచర్‌పై ఫేస్‌బుక్‌ పనిచేస్తుందని, ఎంపిక చేసిన యూజర్లకే ఇది అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్‌ను ఫేస్‌బుక్‌ అధికారికంగా లాంచ్‌ చేయబోతుంది.

ఈ ఫీచర్‌తో యూజర్‌ బేస్‌ను మరింత విస్తరించాలని ఫేస్‌బుక్‌ చూస్తోంది. అలంకరించబడిన ఫోటోలు, వీడియోలు, జీఐఎఫ్‌లను ఈ కొత్త ఫీచర్‌తో వాట్సాప్‌లోకి తీసుకురావచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌ అనుభవాన్ని మరింత మెరుగుపరుచనున్నామని, ప్రతి సందర్భాన్ని తేలికగా యూజర్లు షేర్‌ చేసుకునేలా దీన్ని పరీక్షిస్తున్నామని ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి టెక్‌ క్రంచ్‌కు తెలిపారు. వాట్సాప్‌లో మిగతా వాటి మాదిరిగానే, వాట్సాప్‌ స్టేటస్‌లోకి పోస్టు చేసే ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ కూడా ఎన్క్రిప్టెడ్‌గా ఉండనుందని రిపోర్టులు తెలిపాయి. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలకు, వాట్సాప్‌ స్టేటస్‌లకు రోజుకు 300 మిలియన్ల మంది యాక్టివ్‌ యూజర్లున్నారని ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఇటీవలే ప్రకటించారు. ఈ సంఖ్యను మరింత పెంచాలని ఫేస్‌బుక్‌ చూస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com