జనవరి 8న 'జై సింహా' ప్రీ రిలీజ్ ఈవెంట్..
- January 05, 2018
బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'జైసింహా'. నయనతార, నటాషాదోషి, హరిప్రియ కథానాయికలు. కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. సీకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పుడు ప్రమోషన్ పర్వంలోకి దిగింది. ఈనెల 8న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. బాలయ్యతో పనిచేసిన దర్శకులు ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరవుతారు. బోయపాటి, క్రిష్, తేజ. వీళ్లంతా ఈ వేడుకలో కనిపించే అవకాశం ఉంది.
'జైసింహా' అభిమానులు పండగ చేసుకునే సినిమా అని, ఇందులో బాలయ్య నట విశ్వరూపం చూస్తారని, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి నిర్మాత చెబుతున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







