తాయిఫ్ లో నవజాత శిశువును నలిపి రాక్షసత్వం చాటుకున్న ముగ్గురు నర్సులు సస్పెండ్
- January 05, 2018
జెడ్డా:' ఎవరికి పుట్టిన బిడ్డరా...వెక్కి వెక్కి ఏడుస్తుందని ' ఓ సామెత తనకు చెందని శిశువు పట్ల ఆ తరహా ఉత్తుత్తి మమకారం వెనుకటికి ఎవరో చూపించారట.. లక్షలాది రూపాయల ప్రభుత్వ వేతనం తీసుకొంటూ మానవసేవే చేయాల్సిన కొందరు నర్సమ్మలు తమ క్రూర నైజాన్ని సామాజిక మాధ్యమాల సాక్షిగా సభ్య సమాజానికి చూపించారు. అపుడే పుట్టిన నవజాత పసిగుడ్డులను తమ కరకు ఇనుప చేతులతో నలిపి నలిపి వికృతానందం పొందారు. తైఫ్ లో ఒక ప్రసూతి ఆసుపత్రిలో నర్సులు చేసిన ఈ దారుణమైన చేష్టలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడిన ఒక వీడియో స్థానికంగా సంచలనం కల్గిస్తుంది. శిశువుల తలలపై బలంగా చేతులతో ఆదమడం...పసి పుర్రెలను కిందకు అదిమి అదిమి నొక్కడంతో నవజాత శిశువు పుట్టిన వెంటనే నరకయాతనకు గురైనట్లుగా ఆ వీడియో లో కనిపించింది, దీంతో ఆ ముగ్గురు సైకో నర్సులను ఉద్యోగాల నుండి తొలగించారు మరియు వారి వృత్తిపరమైన లైసెన్సులు రద్దు చేశారు. ఆ విధంగా పాల్పడిన ముగ్గురు నర్సులను సస్పెండ్ చేశారు. వారిపై బుధవారం విచారణ జరిగింది. నిజ నిర్ధారణ తరువాత, నర్సులు తొలగించబడ్డారని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది మరియు వారి వైద్య లైసెన్సులు రద్దు చేయబడ్డాయి. అంతేకాక వారు ఇతర ప్రాంతాలలోనూ ఆరోగ్య రంగాలలోనర్సింగ్ సాధన చేయకుండా కఠినంగా నిషేధించబడ్డారు.జెడ్డాలోని నేషనల్ గార్డ్ హాస్పిటల్లో మెడికల్ ఎథిక్స్ బోధిస్తున్న డాక్టర్ మొహమ్మద్ అల్-గంది ఈ సందర్భంగా మాట్లాడుతూ : " బాధితులుగా ఉన్న పిల్లల పరిస్థితి చూస్తే , ఎవరికైన సానుభూతి కలగకతప్పదని సోషల్ మీడియాలో వారి రాక్షసత్వం గమనిస్తే ఈ చర్యలు వారిపై తీసుకోవడం చాలా సహజ ప్రతిస్పందన అని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







